Sunday, 26 July 2026 03:50:48 AM

భారతీయ మగువా! రండి,కదలిరండి క్రైస్తవ వనితా తరలిరండి.

Date : 26 August 2024 10:13 PM Views : 732

Neti Sakshyam - వార్తలు / విశాఖపట్నం : అక్టోబర్ 26 విశాఖ సిటీ సాక్ష్యం న్యూస్: కోల్ కత్తాలోని ట్రైనీ డాక్టర్ మౌమితపై పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ... క్రిస్టియన్ మైనారిటీ జాయింట్ ఏక్షన్ కమిటీ ఆద్వర్యంలో విశాఖ gvmc గాంధీ విగ్రహం వద్ద పెద్దఎత్తున మహిళలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు క్రైస్తవ సంఘాలకు చెందిన మహిళలు పెద్దఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా భరత మాతపై బలాత్కారమా అంటూ వివిధ ప్రార్థనా మందిరాలకు చెందిన మహిళలు, పారామెడికల్ సిబ్బంది, నర్శింగ్ స్టాఫ్,వైద్యులు, వైద్య సిబ్బంది, RCMసిస్టర్స్ పెద్దఎత్తున పాల్గొని సఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మౌమితపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ.. క్రొవ్వొత్తులను వెలిగించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో ట్రినిటీ లూధరన్ చర్చ్, A.B చర్చి, Q.M.B చర్చి, I.P చర్చి,కల్వరీ చర్చి, దైవ సన్నిధి ప్రార్ధనా సహవాసం, మరియు విశాఖ క్రిష్టియన్ విమెన్ ఫెలోషిప్ మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :