Monday, 27 July 2026 09:39:40 AM

కూతురు కోసం పురుగుల మందు తాగి తండ్రి మృతి .

Date : 07 October 2024 07:20 PM Views : 502

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : అక్టోబరు 7 సాక్ష్యం న్యూస్: కన్న కూతురు పాముకాటుకు గురై కంటిముందే మరణించడాన్ని జీర్నంచుకోలేని ఆమె తండ్రి పురుగుల మందు త్రాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన పద్మనాభం మండలం బాందేవురం గ్రామంలో చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నాలుగు నెలల క్రితం తన 13ఏళ్ళ కూతురు పాముకాటుకు గురై మరణించడంతో అప్పటి నుండి తీవ్ర మనస్తాపం చెందిన బోనెల సింహాద్రి (41) ఈ నెల 4 న పురుగుల మందు సేవించాడు. దీంతో అతని బంధువులు సింహాద్రిని విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృత్యువుతో పోరాడిన సింహాద్రి సోమవారం మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Naidu (Sr Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: