Sunday, 26 July 2026 03:50:16 AM

సాగునీరు కోసం రోడ్డెక్కిన కృష్ణా డెల్టా సాగు రైతులు

Date : 05 August 2024 11:49 AM Views : 456

Neti Sakshyam - వార్తలు / ఏలూరు/పెదపాడు : సాక్ష్యం ప్రతినిధి ఏలూరు/పెదపాడు మండలం: కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించాలంటూ..వట్లూరులో రైతుల వరి నారుతో నిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు.. కేవలం ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం వల్లే తమకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఆందోళన బాటపట్టారు. నీరు లేక నాట్లు వేసిన భూములు ఎండిపోతున్నాయని..కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన రావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ ద్వజమెత్తారు. ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం వల్లనే కృష్ణా డెల్టా రైతులకు సాగునీరు అందక వరి నాట్లు వేయలేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కే ఈ కెనాల్ ను ఆధునీకరించకపోవడం వలన కర్ర నాచు, తూడు, గుర్రపు డెక్క పెరిగి నీరు పారుదల లేక శివారు ప్రాంత భూములకు అందడం లేదన్నారు.

వేసవికాలంలో చేయాల్సిన కాలువ పనులు అధికారుల నిర్లక్ష్యంతో అన్నదాతలు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్మన సాంబశివరావు, తుమ్మల ధన కోటేశ్వరరావు, కొమ్మన శ్రీహరి రావు, కొమ్మన రామబ్రహ్మం, ఆళ్ళ శ్రీరాములు, పర్వతనేని నాగభూషణం, దారం యోహానురాజు, కే ఎస్ ఎన్ మూర్తి, ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ, ఎస్ వి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :