Sunday, 26 July 2026 03:50:15 AM

తమ్మిలేరులో వరద ఉధృతి శనివారపుపేట కాజ్ వే పై రాకపోకలు బంద్

Date : 08 August 2024 06:26 PM Views : 546

Neti Sakshyam - వార్తలు / ఏలూరు : ఆగస్టు 8 ఏలూరు సిటీ/ సాక్ష్యం ప్రథినిధి: తమ్మిలేరులో వరద ఉధృతి కారణంగా ఏలూరు శనివారపు పేటలో తమ్మిలేరు వంతెన పైకి నీటి ప్రవాహం తాకటంతో ముందు జాగ్రత్త చర్యగా వరద ఉధృతి తగ్గేవరకూ తాత్కాలికంగా రాకపోకలను నిలిపివేసినట్లు ఏలూరు ఆర్డీఓ ఎన్ .ఎస్.కె. ఖాజావలి తెలిపారు. శనివారపుపేట కాజ్ వే వద్ద గురువారం తమ్మిలేరు వరద ఉధృతిని అధికారులతో కలిసి పరిశీలించారు. ఏలూరు నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డా. మాలతి ఆధ్వర్యంలో శానిటేషన్ సిబ్బందితో శనివారంపేట బ్రిడ్జిపై తమ్మిలేరు నీటి ప్రవాహానికి వచ్చే అడ్డంకులను, చెత్తను దగ్గరుండి తొలగిస్తున్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :