Sunday, 26 July 2026 03:57:57 AM

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి

Date : 07 November 2024 02:33 PM Views : 1212

Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : నవంబర్ 7: సాక్ష్యం న్యూస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజల జేబులు ఖాళీ చేసే విధంగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పేద మధ్యతరగతి రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కన్వీనర్ ఆలపాటి నరసింహమూర్తి డిమాండ్ చేశారు. దెందులూరు నియోజకవర్గం లోని మండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు ఏ ఆర్ వి చౌదరి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత హామీల పేరుతో అధికారం చేపట్టిన తరువాత సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చార్జీలను పెంచి ప్రజల నడ్డి విస్తున్నాయని మండిపడ్డారు. ఇందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏలూరులోని విద్యుత్ భవనం ముందు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని.. ఈ కార్యక్రమానికి దెందులూరు నియోజకవర్గం లోని దెందులూరు ,పెదపాడు ,.పెదవేగి, ఏలూరు రూరల్ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు సైతం తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చిలకలపూడి తాతా కృష్ణా, పలగాని సురేషు, గడ్డం రాజారావు తదితరులు ఉన్నారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :