Sunday, 26 July 2026 01:29:05 AM

నారాయణరాజుపేటలో విషాదం. స్కూలు బస్ క్రింద పడి విద్యార్థి మృతి.

Date : 18 September 2024 06:17 PM Views : 2408

Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : సెప్టెంబర్ 18 సాక్ష్యం న్యూస్: క్లీనర్ లేకపోవడం, డ్రైవర్ నిర్లక్ష్యం నర్సరీ చదువుతున్న బాలుడి ప్రాణాలను బలి తీసుకుంది. భీమిలి మండలం లోని నారాయణరాజు పేటలో స్కూల్ బస్ క్రింద పడి బాలుడు మృతి చెందడం స్థానికంగా విషాదం నెలకొంది. పద్మనాభం మండలం రేవిడి గ్రామానికి చెందిన ఆంద్రా స్కూల్ లో నర్సరీ చదువుతున్న బాండెపురపు వేణుతేజ (5) స్కూల్ నుంచి బుధవారం సాయంత్రం యధావిధిగా ఇంటివద్ద బస్ దిగి బస్సు వెనక్కి వెళ్ళాడు. అది గమనించని డ్రైవర్ బస్సును రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఈ క్రమంలోనే బస్సు వెనక చక్రాల క్రింద పడి చిన్నారి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బస్ చక్రాలు తలపై ఎక్కడంతో తల నుజ్జు నుజైంది. భీమిలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కంటిముందే కన్న బిడ్డ ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు,స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :