Sunday, 26 July 2026 04:51:27 AM

కౌలు రైతుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి

Date : 05 October 2024 04:03 PM Views : 480

Neti Sakshyam - వార్తలు / ఏలూరు : అక్టోబర్ 5: సాక్ష్యం న్యూస్ కౌలు రైతుల సమస్యలు పరిష్కారం కోరుతూ ఈ నెల 8న విజయవాడలో జరుగుతున్న కౌలు రైతుల రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ కోరారు. శనివారం ఏలూరులోని జిల్లా పరిషత్ అతిధి గృహం ఆవరణలో రైతు సంఘం, కౌలు రైతుల సంఘం నాయకులు కౌలు రైతుల రాష్ట్ర సదస్సు కరపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా కె. శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా పంటలు దెబ్బతిని కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుల పేరుతోనే ఈ క్రాప్ చేసి నష్టపరిహారం ఇవ్వాలని, ఎకరాకు రూ.25వేలు, వాణిజ్య పంటలకు పెట్టిన పెట్టుబడిని బట్టి రూ.60 వేల నుండి రూ.లక్ష రూపాయలు వరకు పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌలు రైతులు, రైతులు పాల్గొన్నారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: