Sunday, 26 July 2026 03:03:04 AM

గ్రామాల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం. MPP రాంబాబు

Date : 24 August 2024 10:37 AM Views : 452

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : గ్రామ సభలో మాట్లాడుతున్న MPP రాంబాబు

ఆగస్టు 23 పద్మనాభం సాక్ష్యం న్యూస్: దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాలను అభివృద్ధి చేయాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని ఎంపీపీ కె.రాంబాబు అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కొణిదెల.పవనకళ్యాణ్ ఆదేశాల మేరకు మండల స్థాయి అధికారులతో మద్ది, పద్మనాభం గ్రామాలలో ఏర్పాటు చేసిన గ్రామ సభలకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా సహకరించి,జిల్లాలో పద్మనాభం మండలాన్ని ప్రధమ స్ధానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు.అలాగే ఉపాధి హామీ పనులలో భాగంగా పంట కాలువల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అంతకుముందు ఎంపిడిఒ సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామాలలో నెలకొన్న పలు సమస్యలను గుర్తించి ఐదు సంవత్సరాలలో క్రమ పద్దతిలో ప్రధాన్యతనిచ్చి ప్రభుత్వం పరిష్కరిస్తోందని గుర్తుచేసారు. ఈ కార్యక్రమంలో సర్పంచలు బుగత సన్యాసమ్మ, తాలాడ పాప, టీడీపీ యూత్ అధ్యక్షుడు కె.సత్యన్నారాయణ, మండల వైసీపీ యూత్ అధ్యక్షుడు బి.సత్యన్నారాయణ ,మాజీ మండల టీడీపీ అధ్యక్షుడు నగేష్, నాయకులు పద్మనాభం, పైడిరాజు,మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: