Sunday, 26 July 2026 03:50:54 AM

తల్లిపాలు బిడ్డలకు అమృతంతో సమానం

Date : 04 August 2024 01:06 PM Views : 437

Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : ఏలూరు సాక్ష్యం ప్రతినిధి: ప్రతి బాలింత తప్పనిసరిగా బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రి పాలను తప్పనిసరిగా ఇవ్వడంతో పాటు క్రమం తప్పకుండా కనీసం ఆర్నెళ్ళ పాటు బిడ్డకు తల్లిపాలే ఇవ్వాలని ఏలూరు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కెవిఎల్ఎన్ పద్మావతి అన్నారు. శనివారం దెందులూరు మండలంలోని పోతునూరు ప్రభుత్వ పాఠశాలలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని పెదపాడు ప్రాజెక్టు సిడిపిఓ విజయలక్ష్మి, అడిషనల్ సిడిపిఓ రాజశేఖర్ ,పోతునూరు సెక్టర్ సూపర్వైజర్ శ్రీదేవి ఆధ్వర్యంలో పోతునూరు గ్రామ సర్పంచ్ బోదుల స్వరూప్ (నాని) ఆద్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను జరిపించారు. ఈ కార్యక్రమంలో పోతునూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ చైతన్య, వైద్య సిబ్బంది అరుంధతి దేవి పద్మావతి ఏఎన్ఎంలు,ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :