Sunday, 26 July 2026 01:28:33 AM

ఒక చిన్న సహాయం ముగ్గురికి పునర్జన్మ

Date : 10 June 2026 06:01 PM Views : 187

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : జూన్ 10: ప్రాణాలను కాపాడే మహాదానం... రక్తదానం. ప్రమాదాలు, అత్యవసర శస్త్రచికిత్సలు, ప్రసవాలు, తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి రక్తం ఎంతో అవసరం. కేవలం కొన్ని నిమిషాల సమయం వెచ్చించి చేసే ఒకరి రక్తదానం ముగ్గురి ప్రాణాలను నిలబెడుతుంది. ఈ నేపథ్యంలో జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని, భీమునిపట్నం ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో జూన్ 13వ తేదీన రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. యువత, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొనాలని వైద్యాధికారులు కోరుతున్నారు. రక్తదానం చేయదలచిన వారు తమ ఆధార్ కార్డుతో పాటు ముందస్తుగా సీహెచ్‌సీలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. "మీరు ఇచ్చే కొద్దిపాటి రక్తం... ఎవరికో ఒకరికి జీవితాంతం గుర్తుండిపోయే బహుమతిగా మారొచ్చు." రండి... రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలుద్దాం. ----------------------------------------- వైద్య అధికారి, భీమునిపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: