Sunday, 26 July 2026 04:50:38 AM

పాల ధరల పెంపుపై CPM నిరసన

Date : 21 February 2026 08:03 AM Views : 246

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖపట్నం : ఫిబ్రవరి 20 // సాక్ష్యం షార్ట్ న్యూస్ : CPM జిల్లా కమిటీ పిలుపుమేరకు పాల ధరలు పెరిగినందుకు జగదాంబజోన్‌లో CPM పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఎం. సుబ్బారావు అధ్యక్షతన పూర్ణ మార్కెట్‌లోని దుర్గాలమ్మ టెంపుల్ ఎదుట బస్టాప్ వద్ద కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సార్లు పాల రేట్లు పెరగడం, నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా పెరగడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆ ప్రాంతంలో కరపత్రాలు పంపిణీ చేశారు. సీనియర్ నాయకులు వై. రాజు మాట్లాడుతూ, విశాఖ డైరీ వ్యవహారంపై ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. నాయకులు కర్రీ చంద్రశేఖర్ మాట్లాడుతూ, లాభాల్లో ఉన్న విశాఖ డైరీ లీటర్‌కు రూ.2 పెంపు చేయడం దోపిడీ పరాకాష్ట అని అన్నారు. ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సిఐటియు నాయకులు చంద్రమౌళి మాట్లాడుతూ, ఇప్పటికే కార్మికులకు ఉపాధి తగ్గుతున్న సమయంలో ధరల పెంపు ప్రజలపై మరింత భారం మోపుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు హేమ, వరలక్ష్మి, లక్ష్మీపార్వతి, దుర్గతో పాటు ముఠాకళాసి యూనియన్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :