Sunday, 26 July 2026 03:02:19 AM

ఘనంగా ముగిసిన అంతర్జాతీయ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం

Date : 22 February 2026 02:23 PM Views : 235

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : ఫిబ్రవరి 22 స్థానిక ఎస్వీ ఎల్ ఎన్ ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐక్యూఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. సురేఖ మాట్లాడుతూ, రిసోర్స్ పర్సన్స్‌గా పాల్గొన్న ఎస్. నాగేశ్వరరావు (డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, జజన్ యూనివర్సిటీ, సౌదీ అరేబియా), వై. శ్రీనివాసరావు (ఎన్ఐటీ వరంగల్), జితేంద్ర కుమార్ (ఐఐపిఈ, విశాఖపట్నం), కె.వి విద్యాసాగర్ మరియు వై. వెంకట్రావులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా అధ్యాపకులు వృత్తిపరంగా మెరుగుపడతారని, నేటి విద్యా రంగంలో జరుగుతున్న సంస్కరణలకు అనుగుణంగా అధ్యాపకులు నూతన విషయాలను అవగాహన చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్‌గా డాక్టర్ కె.వి. విద్యాసాగర్ మరియు ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌గా శ్రీ బి. ప్రసాద్ రావు వ్యవహరించారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: