Sunday, 26 July 2026 01:29:46 AM

అగమ్యగోచరమైన తల్లి కూతుళ్లకు ఆశ్రయం

Date : 16 May 2026 10:55 PM Views : 150

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / అనకాపల్లి : మే 16: అనకాపల్లి సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన లంకపల్లి లక్ష్మి(60), ఆమె వికలాంగురాలైన కుమార్తె కమల పద్మజ(40) దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తుండగా సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది. పక్షవాతం రావడంతో తల్లి పరిస్థితి విషమించగా, బంధువుల సమాచారం మేరకు ట్రస్ట్ అధ్యక్షులు దాడి శ్రీను స్పందించి ఉచిత అంబులెన్స్ ద్వారా వారిని తరలించారు. అనంతరం లయోలా వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పించేందుకు వ్యవస్థాపకులు దొడ్డి ప్రకాష్ సహకారం అందించారు. పోలీస్ అనుమతి అవసరమవడంతో పెందుర్తి సీఐ కె. సతీష్ కుమార్ వెంటనే స్పందించి సిబ్బందితో మాట్లాడి తల్లి కూతుళ్లకు వృద్ధాశ్రమంలో ఆవాసం కల్పించారు. ఈ సేవా కార్యక్రమంలో సహకరించిన లయోలా వృద్ధాశ్రమ నిర్వాహకులు, పోలీసు అధికారులకు సాయి హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: