Sunday, 26 July 2026 03:51:03 AM

వర్షాల్లోనే కొనసాగిన బుర్రకథలు

Date : 19 December 2024 07:44 PM Views : 1718

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : డిసెంబరు 19 సాక్ష్యం న్యూస్: జాతీయ ఇంధన పొదుపు కార్యక్రమంలో భాగంగా భీమిలి సబ్ డివిజన్ పరిధిలో జోన్-3 మధురవాడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోలాకి శ్రీనివాసరావు ఆద్వర్యంలో ఇందన పొదుపుపై నిర్వహిస్తున్న వారోత్సవాలకు విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం భీమిలి విద్యుత్ సిబ్బంది బుర్రకథ రూపంలో పలు చోట్ల అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. అందులో భాగంగా భీమిలి గంటస్థంభం స్టేజిపై విద్యుత్ వినియోగం, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ప్రధానమంత్రి సూర్యా ఘర్ (సౌర శక్తి వినియోగం) వలన విద్యుత్ బిల్లు ఆదా వంటి విషయాలను బుర్రకథా రూపంలో వివరిస్తూ వియోగదారులను ఆకట్టుకున్నారు. మరోవైపు కరపత్రాలను పంచుతూ విద్యుత్ వినియోగదారుల్లో అవగాహన కల్పించారు. ఇదిలా ఉంటే! చలిగాలు వీస్తున్నా.. వర్షం కురుస్తున్నా.. విద్యుత్ లైన్లలో అంతరాయాలను సరిచేస్తూ... విద్యుత్ సిబ్బంది పలు ప్రాంతాల్లో ఈ అవగాహన కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగించారు. స్థానిక విద్యుత్ A.E U.శకరయ్య ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో లైన్ ఇన్స్పెక్టర్ లంక రమేష్, లైన్ మెన్లు చింతకాయల రాజు,గుర్రంపల్లి రాజు, బోని,కృష్ణ, సాయి మరియు ప్రభుత్వ కళాశాల విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :