Sunday, 26 July 2026 04:48:50 AM

అందని లోకాలకు అడిదం సన్యాసిరాజు

Date : 03 December 2024 08:40 PM Views : 1564

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : డిసెంబరు 3 సాక్ష్యం న్యూస్: భక్తి పారవశ్యంతో పాడిన పాటలు భక్తులలో ఆధ్యాత్మిక తను పెంపొందించడం తోపాటు హుషారెక్కించే పాటలతో అందరినీ ఉత్తేజ పరిచిన ఆ గొంతు మూగ బోయింది. ఇక ఆ స్వరం వినపడదన్న వార్త పలువురి హృదయాలను కలచివేసింది. విశాఖ జిల్లా భీమిలీకి చెందిన సుప్రసిద్ధ గాయకుడు,అయ్యప్ప పరమ భక్తుడు ఆడిదం సన్యాసిరాజు(శ్రీను) ఇక లేరన్న వార్త అటు కుటుంబ సభ్యులు, ఇటు సహచరులు, జీర్నంచుకోలేని పరిస్థితి. ప్రతీ ఏటా కార్తీక మాసంలో క్రమం తప్పకుండా అయ్యప్ప మాలధారణ దీక్ష చేపట్టడం తోపాటు పలువురిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ.. గురుస్వామిగా, స్నేహితునిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం మాత్రమే కాకుండా పలు వినోద కార్యక్రమాల్లో పాల్గొని తన దైన శైలిలో పాటలు పాడి..తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. గాన కోకిలగా పిలవబడుతూ పలువురి మన్ననలు పొందిన అడిదం సన్యాసిరాజు దూరమవ్వడం పలువురికి కంటతడి తెప్పించింది. శబరిమలై మండల యాత్రలో భాగంగా సోమవారం ఉదయం భీమిలిలో తన నివాసం నుండి తన సహచర బృందంతో బయలుదేరిన మృతుడు సన్యాసిరాజు మంగళవారం పంబానదికి చేరుకొని,అనంతరం అపచ్చిమేడు కొండ ఎక్కుతుండగా ఒక్కసారిగా కుప్పకూలారు. సహచర భక్తులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. విషయాన్ని తెలుసుకున్న మృతుని కుటుంబీకులు, బంధువులు సోక సముద్రంలో మునిగిపోయారు. సన్యాసిరాజు పార్ధీవ దేహాం బుధవారం రాత్రికి భీమిలి చేరవచ్చని,గురువారం అంత్యక్రియలు చేపట్టనున్నట్లు మృతుని కుటుంబ సభ్యులు అడిదం కిషోర్ స్పష్టం చేశారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: